పండగల వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాలలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు.విశాఖపట్నం-షాలిమర్ వీక్లీ స్పెషల్ ప్రతి మంగళవారం ఉదయం 11.20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది.ఈ రైలు అక్టోబర్ 21వ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో షాలిమర్–విశాఖపట్నం ప్రతి బుధవారం ఉదయం 5 గంటలకు షాలిమర్‌లో బయలుదేరి, అదే రోజు రాత్రి 8.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది.