హైదరాబాదులోని హైటెక్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను పొందేందుకు జిల్లాలో గ్రామ పాలనాధికారులుగా ఎంపికైన వారిని శుక్రవారం జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ కు 7 ప్రత్యేక బస్సుల ద్వారా రెవెన్యూ అధికారులు తీసుకువెళ్లారు. ఆ బస్సులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కలెక్టర్ కార్యాలయం నుండి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్వోలుగా మరియు విఆర్ఏ లుగా పనిచేసి ప్రస్తుతం ఇతర డిపార్ట్మెంట్లలో పని చేస్తున్న వారికి ప్రభుత్వం తిరిగి రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామ పాలన అధికారులుగా నియమించడం జరిగిందన్నారు.