జిల్లావ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసిన తర్వాత సోమవారం ఉదయం ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భీమవరం మావుళ్ళమ్మ ఆలయం, పంచారామ క్షేత్రాలైన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర ఆలయాలు సంప్రోక్షణ అనంతరం తెరుచుకున్నాయి. సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది.