విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సమూల మార్పుల కోసం అధ్యయనం చేయడం జరుగుతుందని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు సోమవారం రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వికారాబాద్లోని ప్రభుత్వ జూనియర్ డిగ్రీ డైట్ కళాశాలను కమిషన్ సభ్యులు పిఎన్ విశ్వేశ్వరరావు డాక్టర్ చారుకొండ వెంకటేష్, జోష్నా శివ రెడ్డి లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇందులో భాగంగా మౌలిక సదుపాయాలు బోధన సిబ్బంది విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలోని మౌలిక వసతులు చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేస్తామన్నారు