మంచిర్యాల పట్టణంలోని రాళ్లవాగులో మునిగి గౌతమి నగర్ కు చెందిన గొల్ల చిన్న గంగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మతిస్థిమితం సరిగా లేని గంగయ్య గురువారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం రాళ్లవాగులో మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై మజారుద్దీన్ తెలిపారు.