ఈనెల 28వ తేది నుండి 30వ తేది వరకు విశాఖపట్నంలో జరగనున్న సేనతో సేనాని కార్యక్రమాన్ని జనసైనికులు, వీర మహిళలు విజయవంతం చేయాలని, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి పిలుపునిచ్చారు. మంగళవారం 3pm విజయనగరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జనసేన పార్టీ ఆవిర్భవించి ప్రజల పక్షాన నిలబడి ఎన్నో ఆటుపోట్లను అధిగమించి నేడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పాలిస్తున్నామని,పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దశ దిశ నిర్దేశం చేసేందుకు ఈనెల 30వ తేదీన విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో