YCP నాయకులు చీర, జాకెట్ వేసుకుని బస్సు ఎక్కితే ఉచిత బస్సు ప్రయాణం ఉందో లేదో తెలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం సంతబొమ్మాళి మండలం భావనపాడులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం కొన్ని బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం కల్పిస్తోందని YCP నాయకులు చేస్తున్న విమర్శలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. మహిళలను ఈ విషయంపై YCP నాయకులను ప్రశ్నించాలని కోరారు.