గుత్తి పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో నివాసముండే సురేష్, ఎస్టర్ రాణి కుమారుడు జేమ్స్ (4) ఇంటిముందు ఆడుకుంటుండగా విషపురుగు కాటు వేసింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు గమనించి వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే వైద్యం చేశారు. అనంతరం అనంతపురం రెఫర్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.