ఈ నెల 9 వ తేదీ అనగా రేపు మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన "అన్నదాత పోరు" కార్యక్రమానికి అనుమతి లేదని గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ ఇంచార్జ్ డిఎస్పీ అజీజ్ వెల్లడించారు. సోమవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా డిఎస్పీ అజీజ్ మాట్లాడారు రేపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని ఆయన తెలిపారు. ముందస్తు అనుమతులు లేని ఏ కార్యక్రమానికి అనుమతించేది లేదని డిఎస్పీ అన్నారు. ర్యాలీలు, ధర్నాలు, గుంపులుగా రావడానికి అనుమతి లేదని చెప్పారు.