ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీలో అచ్చిరెడ్డి నగర్ లో నందు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గణనాథుడి విగ్రహానికి మహిళలు 500 50 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆ తర్వాత పూజలు నిర్వహించారు. గత ఐదేళ్ల నుంచి అచ్చిరెడ్డి నగర్ లో ఇలా పూజలు చేస్తున్నట్టు అక్కడి మహిళలు తెలిపారు.