అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండల పరిధిలోని రాచానపల్లిలో కుటుంబం పై దాడి చేసి గాయపరిచిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి అదే గ్రామానికి చెందిన రాజారెడ్డి అతని భార్య ఉమామహేశ్వరి ఐదేళ్ల చిన్నారిపై శివారెడ్డి వెంకటరామిరెడ్డి సుధీర్ పద్మావతి లక్ష్మీదేవిలో కట్టెలతో రాళ్లతో దాడి చేశారని బాధితుడు తెలిపారు. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఇటుకల బట్టి విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది.