అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం 15వ ధ్యాన వసంతోత్సవం పెదగంట్యాడ జి.వి.యం.సి. కళ్యాణ మండపంలో ధ్యాన కేంద్రం నిర్వాహకులు మీసాల శివగణేశ్వరరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, పల్లా కార్తీక్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పల్లా కార్తీక్ , గాజువాక ప్రాంతంలో గల వివిధ ధ్యాన కేంద్రాలు నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, పత్రీజీ అశయమే తన ఆశయంగా భావిస్తూ ధ్యాన జగత్, శాఖాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణానికి ఎల్లవేళలా కృషి చేస్తూ గత 15 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు