అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను శనివారం కలికిరి పట్టణంలోని బీడీ కాలనీ వద్ద వైకాపా కలికిరి గ్రామ కమిటీ అధ్యక్షులు ఎంఐ హనీఫ్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేకును మండల కన్వీనర్ రమేష్ రెడ్డి, రత్నశేఖర్ రెడ్డి, ఎస్టిడి హరి, మధుసూదన్ రెడ్డి తదితరులు కోసి పంపిణీ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కలికిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు.