కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గిరిజన విద్యార్థులు శుక్రవారం తేజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గోధుమ గింజలను తొమిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. మొలకెత్తిన బుట్టలను నెత్తిపై పెట్టుకొని నృత్యాలు చేశారు. అనంతరం ఆనందంగా పండుగ నిర్వహించారు. అనంతరం వాటిని నీటిలో నిమర్జనం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.