జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా 20 మందికి మూడు చక్రాల ట్రై సైకిల్ దివ్యాంగులకు అందజేశారు.అనంతరం ప్రతి దివ్యాంగుడు ని పేరుపేరునా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో దివ్యాంగులకు 100 సైకిళ్లు పంపిణీ చేయాలని అయితే ఈరోజు 20 మంది దివ్యాంగులకు అందజేశామని మిగతా వాటిని అంచలంచలుగా వారికి అందజేయడం జరుగుతుందని అన్నారు.