ఎఐటియుసిఅనుబంధఏ.పి.మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్. ప్రభుత్వ గుర్తింపు కలిగిన సంఘం విశాఖపట్నం జిల్లా సర్వ సభ్య సమావేశం పెద్ద వాల్తేరు టీబి హాస్పిటల్ ఆవరణంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పి అప్పారావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. గిరిబాబు మాట్లాడుతూ వైద్య ఉద్యోగుల కు 36%తాత్కాలిక భృతి ప్రకటించి, 12 వేతన కమిటీ చైర్మన్ నియమించి పెండింగ్ డి. ఏ లు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలు పరిస్కారం కొరకు అనేక పోరాటాలు చేసి హక్కులు సాధించామని తెలియ చేసారు.