నల్గొండ జిల్లా చింతపల్లి 11 కెవి విద్యుత్ షాక్ గురై ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలైన సంఘటన చింతపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుర్మేడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారి పక్కన భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న హెవెన్లీ హ్యాంగర్, అనే షాపింగ్ లో బుధవారం ఆ బిల్డింగ్ లో విద్యుత్ కు సంబంధించిన పనులు చేపడుతున్నారు. ఇటీవల ఆ బిల్డింగ్ లో ఒక హోటల్ ని నడిపి అనివార్య కారణాలవల్ల మూసి వేయడం జరిగింది.