అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తీవ్ర అనారోగ్యంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహం నీ పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లోని మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.