దేవనకొండ సంత మార్కెట్, అంగన్వాడి కేంద్రం పరిసరాలు మురుగు నీటితో నిండిపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. బుధవారం నిల్వ నీరు దుర్వాసన వెదజల్లుతుండగా పందుల సంచారం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు చదువుకునే అంగన్వాడి దగ్గర ఈ పరిస్థితులు ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని, వెంటనే శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.