టెక్కలి కేంద్రంలో ఎరువుల కోసం ఆదివారం రైతులు బారులు తీరారు. ఈ ఏడాది ఖరీఫ్ వరి సీజన్ ప్రారంభం నుంచి వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో సాగుకు సన్నద్ధమయ్యారు. అవసరానికి సరిపడా ఎరువులు సరఫరా కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి గొడవలకు తావు లేకుండా పోలీసులు బందో బస్తిలో ఎరువులు కోసం సాగుదారులు వేచి ఉండాల్సిన పరిస్థితి టెక్కలిలో కనిపించింది