మద్యం మత్తులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరికి గాయాలైన ఘటన ఆసిఫాబాద్ లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బూరుగూడకి చెందిన ఇద్దరు ఆసిఫాబాద్ పట్టణంలోని ఓ వైన్స్ షాప్ లో మద్యం తాగారు. అనంతరం బైక్ పై ఇంటికి బయలుదేరారు. కొంత దూరం వెళ్లిన తర్వాత బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.