Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 23, 2025
వింజమూరు మండలంలో డబ్బు కొట్టు లోను పట్టు అన్న చందంగా వెలుగు కార్యాలయం సిబ్బంది వ్యవహరించడంపై గ్రూపు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో విజయలక్ష్మి గ్రూపుకు ఉన్నతి లోన్, మరియు శ్రీనిధి లోన్ మంజూరు చేస్తామని చెప్పి మా చేత బయోమెట్రిక్ వేయించుకొని మూడు నెలలు అవుతున్న ఇప్పటివరకు మంజూరు కాకపోవడంతో, గ్రూప్ సభ్యులు సీసీ ని,వివోఏ నీ వివరణ అడగగా సీసీ ఇచ్చిన వివరాల మేరకు మంజూరు కాలేదని చెప్పడంతో ఆగ్రహించిన గ్రూప్ సభ్యులుకు, సీసీ కి మధ్య వాగ్వివాదం జరిగింది. సరైన సమాధానం చెప్పు నందున స్థానిక ఎంపీడీవో కు ఫిర్యాదు చేశారు.