అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారి వద్ద ఉన్న రైల్వే ట్రాక్ వద్ద గూడ్స్ రైలు కింద పడి గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. దీంతో రైల్వే ఎస్సై వెంకటేష్ సమాచారాన్ని తెలుసుకొని సంఘటన స్థలాన్ని తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. మృతుడు 60 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.