యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపు పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ నిర్మాణం మేరకు డబ్బులు పడ్డాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కావలసిన సిమెంట్ స్టీల్ కూడా తక్కువ ధరకు ఇచ్చేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు.