సదాశివపేట, కొండాపూర్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లలోని రికార్డులను పరిశీలించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సదాశివపేట స్టేషన్లోని సీసీ కెమెరాలను కూడా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు.