కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి మళ్లీ పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శుక్రవారం సాయంత్రం ఇన్ ఫ్లో 4,60,340 క్యూసెక్కులు చేరిందని అధికారులు తెలిపారు. బ్యారేజ్ లోని 59 గేట్లను తెరిచి అంతే మొత్తంలో నీటిని దిగువకు పదులుతున్నామన్నారు.