రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్య తనిస్తుందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంబాజీపేటలోని కొర్లపాటి వారి పాలెం వద్ద నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణానికి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. రూ.1.10 కోట్లు నాబార్డ్ నిధులతో ఈ రహదారి నిర్మాణం చేపడుతున్నామన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.