నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని వాంకిడి సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం వాంకిడి మండలం బంబార గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. తనిఖీల్లో ధృవీకరణ పత్రాలు లేని 32 ద్విచక్రవాహనాలన స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని, ప్రజలందరు పోలీసులకు సహకరించాలన్నారు. గ్రామా ల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, అనుమానస్పదంగా కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.