రామచంద్రపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ద్రాక్షారామం లో భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసి కన్వీనర్ మగాపు అమ్మిరాజు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు, ఆటో యూనియన్లు, ప్రజా సంఘాలు, విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. కాకినాడ ముద్దు అమలాపురం వద్దు అంటూ నినాదాలు చేశారు.