యాదమరి మండలం రసూల్‌నగర్‌కు చెందిన నగీన (25) అనే వివాహిత మహిళ తన మూడు సంవత్సరాల బాబుతో కలిసి కుటుంబ సమస్యల కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. "రైల్వే ట్రాక్‌పై పడిపోయి చనిపోతాను, నన్ను వెతకద్దు" అని తన తండ్రి జబీర్‌కు ఫోన్‌లో తెలిపింది. ఆ సమాచారాన్ని జబీర్ యాదమరి పోలీసులకు అందజేశారు. పోలీసులు ఆమె మొబైల్ నెంబర్ ద్వారా సాంకేతికంగా లొకేషన్ ట్రేస్ చేసి, తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద గుర్తించారు. వెంటనే స్థానిక రైల్వే పోలీసుల సహకారంతో ఆమెను ఆత్మహత్యాయత్నం నుంచి కాపాడి, భరోసా కల్పించి, తల్లిదండ్రులకు అప్పగించారు.