పెద్దకొత్తపల్లి మండలంలోని తీర్ణాంపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై శనివారం సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి దశరథ నాయక్ మాట్లాడుతూ, గ్రామంలో ఒక్క బోరు మాత్రమే ఉండటంతో మంచినీటి సమస్య తీవ్రంగా మారిందని, ఫ్లోరైడ్ నీటితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు లేమి, డ్రైనేజీ సదుపాయం లేకపోవడం వలన వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చెంచు గిరిజనులకు దోమతెరలు, రగ్గులు, మెడికల్ క్యాంపులు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.