Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 9, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, చేజర్ల మండలం ఆదురుపల్లికి చెందిన కిష్టయ్య, పెంచలమ్మ దంపతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రాత్రి వారి ఇంట్లోకి పందులు చొరబడి 60 కేజీల బియ్యం, ఇతర చిల్లర సామాన్లు పాడుచేశాయి. దీంతో గృహంలో ఉన్న వస్తువులు నష్టపోయి ఇల్లు కూడా దెబ్బతిన్నదని బాధితులు వాపోయారు. తరచుగా పందుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో అధికారులకు తెలియజేయడంతో మంగళవారం పందులను పట్టించి వేరే ప్రాంతానికి తరలించారు.