నంద్యాల జిల్లా బండ ఆత్మకూరు మండలం సంత జూటూరు గ్రామంలో ఓ RMP వైద్యుడు నిర్వహిస్తున్న క్లినిక్ను సీజ్ చేయాలని అధికారులను జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా RMP డాక్టర్లు ప్రాక్టీస్ చేయడం నేరమన్నారు. వారికి ఎలాంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. వారు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలన్నారు. సెలైన్ ఎక్కించడం, ఇంజక్షన్లు వేయడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.