సారంగాపూర్ మండలం ధని గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CI కృష్ణ ఆధ్వర్యంలో 84 ద్విచక్ర, 2 త్రిచక్ర వాహనాలను సీజ్ చేసి పత్రాల తనిఖీ చేశారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు CI తెలిపారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని, మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. గంజాయి, మద్యం, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని యువతకు సూచన. నిషేధిత కార్యకలాపాలపై సమాచారం 8712659599కు గోప్యంగా అందించాలని కోరారు. ఎస్సైలు శ్రీకాంత్, లింబాద్రి, రవీందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు