మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పై మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం పదిగంటల సమయంలో విజయవాడ తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో మెడికల్ సీట్లను 20 లక్షల రూపాయలకు అమ్ముకునే విధంగా జీవో ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.