శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వైసిపి కదిరి నియోజకవర్గం ఇంచార్జ్ మక్బూల్ అహ్మద్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ ప్రస్తావించిన ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. మెంటల్ బాలకృష్ణ అంటూ ఫైర్ అయ్యారు. మద్యం మత్తులో బాలకృష్ణ అసెంబ్లీకి వచ్చారని, ఆయనను ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయాలన్నారు. అలాగే ఆయనకు ఇచ్చిన పద్మ భూషణ్ పురస్కారాన్ని రద్దు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.