విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే వీధిలోకి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఉక్కునగరంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మే నెలలో సెండ్ చేసిన వారందరినీ విధుల్లో నుంచి తొలగించారని తెలిపారు. లేబర్ చట్టాలను అనుసరించే తమ అందరం సమ్మెలో పాల్గొన్నామని ముందుగా నోటీసు ఇచ్చినప్పటికీ యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరించిందని తెలిపారు.