ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో తెలుగుగంగ ప్రాజెక్టు కాలువలో పడి షరీఫ్ (34) మృతి చెందాడు. టూరిస్ట్ గైడ్ గా పని చేస్తున్న షరీఫ్ గత 5 రోజుల క్రితం కాలువలో కొట్టుకొని పోయి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా రెండు కిలోమీటర్ల దూరంలో షరీఫ్ మృతదేహం లభ్యమయింది. దీనితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటన స్థలం వద్దనే యువకునికి అంత్యక్రియలు నిర్వహించారు.