ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఉండాలని, వారంతా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలోని పలు విగ్నేశ్వరుల మండపాలను దర్శించుకున్నారు. అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం రాత్రి 10 గంటల వరకు విగ్రహాలను ఆయన సందర్శించారు.