చేయి వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు చేయి తెగిన ఘటన బుధవారం ఉదయం ఏటూరునాగారంలో జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన సురేష్ గణపతి మండపం కోసం పదునైన మిషన్ తో కర్ర కోస్తుండగా ఒక్కసారిగా చేతిపై పడడంతో చేయి తెగి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.