ఎన్నికల ప్రక్రియలో అతిముఖ్య ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమవుతుంది. దీనికోసం జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్లమెంటు స్థానంలో పోటి చేసే అభ్యర్ధులు కలెక్టరేట్లో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయాలి. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఆర్డీవో బి శాంతి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఒక్కో అభ్యర్ధి గరిష్టంగా నాలుగు సెట్లను దాఖలు చేయవచ్చు.