పెద్ద శంకరంపేట మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎంపికైన వెంకటేశం, వేణు శేఖర్, మారుతి, సుమంగళ, బొజ్య నాయక్ లను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ శాలువా మెమొంటో జ్ఞాపకతో సత్కరించారు. నారాయణఖేడ్ లో నిర్వహించిన కార్యక్రమంలో వీరికి సన్మానించారు. ఈ సన్మన కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.