పెద్ద కడబూరు:ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని పెద్దకడబూరు ఏఎస్ఐ ఆనంద్ అన్నారు. హెల్మెట్ వాడకంపై ద్విచక్ర వాహనదారులకు శనివారం అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.ప్రయాణం చేసేటప్పుడు అనుకోని ప్రమాదం జరిగితే హెల్మెట్ తమ తలను రక్షిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.