వినాయక చవితి పండుగ సామాజిక సామరస్యానికి ప్రతీక అని... పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా సంబంధిత అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన వినాయక చవితి పండుగను శాంతియుతంగా సాంప్రదాయబద్దంగా నిర్వహించుకునేందుకు అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి లతో కలిసి శాంతియుత కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సామాజిక సమగ్రతను ప్రతిబింబించే పండుగ అని, ప్రజలు సామరస్యంత