నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బామినీ తాండ గ్రామ సమీపంలో లో ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం గంగాధర్ తన ఆటో లో సిమెంట్ సంచుల లోడ్ తో లింగి గ్రామానికి వెళుతుండగా బామిని తండా గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు ఆటో లోయలో బోల్తా పడింది. ఈ క్రమంలో ఆటోలో ఉన్న సంచులు గంగాధర్ ముఖంపై పడడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థానానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.