రైతుల పంటలకు యూరియాను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చెప్పట్టారు.గొల్లపల్లి మండలంలో జగిత్యాల - పెద్దపల్లి రహదారిపై ఆందోళన చేయగా, ధర్మారం మండలం కేంద్రంలో కరీంనగర్ - రాయపట్నం రాష్ట్ర రహదారిపై నిరసన తెలిపారు.ఇక బుగ్గరాం,ఎండపల్లి,వెల్గటూర్ మండలాల్లో పార్టీ నాయకులు ఆందోళన చేశారు.ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.యూరియాను రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు.రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని, వెంటనే సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు.