కుప్పంలో మహిళా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శనివారం శంకుస్థాపన చేశారు. హంద్రీనీవా జలాలకు జల హారతి ఇచ్చిన అనంతరం ఆయన హంద్రీనీవా స్తూపంతో పాటు మహిళా ఇండస్ట్రియల్ పార్క్, మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి, ఎంపీ ప్రసాద్ రావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.