గన్నవరం లో విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని గన్నవరం సీఐ బీవీ శివప్రసాద్ సూచించారు. శనివారం వికేఆర్ కళాశాలలో ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నో డ్రగ్స్, నో టెన్షన్స్ అనేదే విజయానికి సరైన సూత్రమని పేర్కొన్నారు. అనంతరం మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై రూపొందించిన పోస్టర్లను ప్రదర్శించి విద్యార్థులకు వివరించారు.