Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 12, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం పూర్తి సమర్ధం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 72.250 టీఎంసీల నీటిమట్టం నమోదయిందాన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 21, 480 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నట్లు తెలియజేశారు. ఆదివారం నాటికి 74 టీఎంసీల నీటిమట్టం నమోదు అవుతుందని ఈ నేపథ్యంలో ఆదివారం ఉ. 10 గంటలకు జలాశయం క్రస్ట్ గేట్ల ద్వారా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి నీటి విడుదల చేస్తారని ఈఈ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, జిల్లా అధికారులు పాల్గొంటారని తెలియజేశారు.