రాజమండ్రి నగరంలో క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్టు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రి మున్సిపల్ కాలనీలో మున్సిపల్ కాలనీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో 18 సీజన్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.